జైపూర్‌లో 130 ఏళ్ల తరువాత మమ్మీ బయటకు!

ABN , First Publish Date - 2020-08-21T06:09:49+05:30 IST

ఈజిప్టులో ఉన్న మమ్మీల (ప్రాచీన మానవ కళేబరం) గురించి పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. అలాంటి ఓ మమ్మీ మనదేశంలోనూ ఉంది.

జైపూర్‌లో 130 ఏళ్ల తరువాత  మమ్మీ బయటకు!

ఈజిప్టులో ఉన్న మమ్మీల (ప్రాచీన మానవ కళేబరం) గురించి పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. అలాంటి ఓ మమ్మీ మనదేశంలోనూ ఉంది. అది కూడా ఈజిప్టు నుంచి తీసుకొచ్చిందే! ఆ మమ్మీని 130 ఏళ్ల తరువాత మొదటిసారి బయటకు తీశారు. ఇది 2400 ఏళ్ల క్రితం నాటిది. ఇంతకీ ఆ మమ్మీని ఎందుకు బయటకు తీశారో తెలుసా? భారీవర్షాల కారణంగా వరదలు వచ్చి మమ్మీ మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది.

  1. జైపూర్‌లోని ఆల్బర్ట్‌ హాల్‌ మ్యూజియంలో ఒక మమ్మీ ఉంది. శతాబ్దం కిందట ఆ మమ్మీని ఈజిప్టులోని కైరో నుంచి రాజస్థాన్‌ తీసుకొచ్చారు. ఒక గ్లాసు బాక్సులో పెట్టి, సురక్షితమైన ప్రదేశంలో పెట్టారు. ఆ మమ్మీ పేరు ‘టుటు’.
  2. ఇటీవల రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. మ్యూజియంలో వరద నీరు మోకాలి లోతు వరకు చేరింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, రికార్డులు అన్నీ తడిసి ముద్దయ్యాయి. దాంతో అధికారులు ముందు జాగ్రత్తగా మమ్మీని అక్కడి నుంచి తరలించారు.
  3. 130 ఏళ్ల క్రితం ఈజిప్టు నుంచి తీసుకొచ్చాక, ఆ మమ్మీని బయటకు తీయడం ఇదే మొదటిసారి. వరదల మూలంగా మ్యూజియంను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-08-21T06:09:49+05:30 IST