Abn logo
Sep 23 2021 @ 20:32PM

పెళ్లయిన 15 రోజుల తర్వాత మొదటిసారి అత్తారింట్లో వంట చేసిన నవ వధువు.. టేస్ట్ బాగుందని ఎగబడి తిన్నారు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఇంటర్నెట్ డెస్క్: తొలిసారిగా కోడలి చేతి వంట రుచి చూస్తూ ఆ ఇంట్లో వారందరూ తెగ సంబరపడిపోయారు. అద్భుతంగా వంట చేసిందంటూ ఎగబడి తిన్నారు.  ఆ తరువాత.. ప్రతిఒక్కరూ మూర్ఛపోయారు. మెలకువ వచ్చాక జరిగిన దారుణం గురించి తెలుసుకుని కంగుతిన్నారు. ఇంతగా మోసపోతామనుకోలేదంటూ పోలీసుల వద్ద లబోదిబోమన్నారు. రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారితీసింది. అసలేం జరిగిందంటే..

సికార్ జిల్లాకు చెందిన హెమ్‌రాజ్ అనే యువకుడికి సెప్టెంబర్ 2న వివాహం జరిగింది. అతడి భార్య పేరు దీప్ కౌర్. ఓ మధ్యవర్తి ద్వారా ఈ సంబంధం కుదిరింది. కాగా.. వారి జంట అన్యోన్యంగా ఉండటం చూసి హేమంత్ కుటుంబసభ్యులు మురిసిపోయారు. కొత్త కోడలు ఇంటికి కొత్త కళ తెచ్చిందంటూ సంతోషించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 16న ఆమె తొలిసారిగా వంట చేసేందుకు పూనుకుంది. ఆమె వంట అద్భుతంగా చేయడంతో ఇంట్లోని వారందరూ లొట్టలేసుకుని తిన్నారు. ఆ..తరువాత అందరూ స్పృహ తప్పిపోయారు.


ఈ అవకాశం కోసమే ఇంతకాలం ఓపిగ్గా ఎదురు చూసిన కోడలు దీప్‌ కౌర్ ఇంట్లోని నగానట్రా డబ్బులూ తీసుకుని పారిపోయింది. వారికి మెలకువ వచ్చి చూస్తే..ఇంట్లో ఆమె జాడ కనిపించలేదు. మధ్యవర్తికి ఫోన్ చేస్తే అతడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇంట్లోనేమో నగలూ డబ్బులూ కనిపించలేదు. దాదాపు 60 వేల నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని ఆమె జంపైపోయింది.  ఘరానా కోడలు తమను పక్కా వ్యూహంతో నట్టేటముంచి పారిపోయిందని తెలుసుకుని లబోదిబోమన్నారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రత్యేకంమరిన్ని...