Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేమించి పెళ్లాడిన మహిళ.. అత్తామామల నోటి నుంచి వచ్చిన మాటలు విని షాక్.. రెండేళ్ల తర్వాత భర్త ఇంట్లో లేని సమయం చూసి..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 24ఏళ్లు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి.. భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు బాబు కూడా జన్మించాడు. ఈ క్రమంలో అత్తామామల నోటి నుంచి వచ్చిన మాటలను విని ఆమె షాకైంది. ఇదేంటని భర్తను నిలదీసింది. అయితే కట్టుకున్నవాడని మౌనంగా ఉండటంతో ఆమె తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. 


హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన సంజూ.. వికాస్ అనే వ్యక్తిని ఇష్టపడింది. అతడు కూడా ఆమెను ఇష్టపడటంతో కొన్ని రోజుల పాటు ప్రేమలో మునిగితేలారు. అనంతరం పెళ్లి చేసుకోలని నిర్ణయం తీసుకున్నారు. ఎలాగోలా కుటుంబ సభ్యులను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె తన భర్తతో కలిసి అత్తారింట్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే వారికి ఓ బాబు కూడా జన్మించాడు. ఆ తర్వాత ఆమెకు అత్తారింట్లో వేధింపులు మొదలయ్యాయి. కట్నం డబ్బుల కోసం అత్తామామలు పట్టుబట్టడంతో ఇదేంటని భర్తను నిలదీసింది.


భర్త దగ్గర నుంచి సమాధానం లేకపోవడంతో..  10నెలల కొడుకు తీసకుని, ఆ ఇంట్లోంచి భర్తతో కలిసి బయటకు వచ్చేసింది. భర్తతో కలిసి అద్దె గదిలో ఉంటున్నప్పటికీ కట్నం కోసం వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం కుటుంబ ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే సంజూ తండ్రి.. వికాస్‌ తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురు మరణానికి వికాస్ కూడా ఓ కారణామేనని ఆయన ఆరోపించారు. రెండేళ్లుగా వరకట్నం కోసం తమ కూతురుని వేధించినట్లు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసలు.. దర్యాప్తు ప్రారంభించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement