ఉన్న‌ట్టుండి చ‌చ్చిప‌డుతున్న గ‌బ్బిలాలు.... ఆందోళ‌న‌లో జ‌నం!

ABN , First Publish Date - 2020-05-31T17:34:42+05:30 IST

బీహార్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల‌ తరువాత ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గబ్బిలాలు చ‌చ్చిప‌డుతుండ‌టంతో జ‌నంలో భయాందోళనలు నెల‌కొన్నాయి. ఇలా గబ్బిలాలు ఉన్న‌ట్టుండి ఎందుకు చనిపోతున్నాయో....

ఉన్న‌ట్టుండి చ‌చ్చిప‌డుతున్న గ‌బ్బిలాలు.... ఆందోళ‌న‌లో జ‌నం!

భోపాల్‌: బీహార్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల‌ తరువాత ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గబ్బిలాలు చ‌చ్చిప‌డుతుండ‌టంతో జ‌నంలో భయాందోళనలు నెల‌కొన్నాయి. ఇలా గబ్బిలాలు ఉన్న‌ట్టుండి ఎందుకు చనిపోతున్నాయో కారణాలు తెలియ‌డంలేదు. ఎంపీలోని బేతుల్ తరువాత సింగ్రౌలి జిల్లాలో గబ్బిలాల మృతి స్థానికుల‌ను భ‌యానికి గురిచేస్తోంది. గ‌బ్బిలాలు ఇలా మృతిచెందడానికి గ‌ల కార‌ణాలు తెలు‌సుకునేందుకు వాటి న‌మూనాల‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన రిపోర్టు ఇంకా రావాల్సివుంది. కాగా బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో మూడు రోజుల క్రితం 300 గబ్బిలాలు మృతి చెందాయి. క‌రోనా వ్యాప్తి నేప‌ధ్యంలో ఇలా గబ్బిలాలు అకస్మాత్తుగా చ‌చ్చిప‌డ‌టంతో వీటికి, క‌రోనాకు సంబంధం ఉంద‌ని అంటున్నారు. అంత‌కుముందు ఉత్తరప్రదేశ్‌లో 800కి పైగా గబ్బిలాలు మృతి చెందాయి. అయితే యూపీలో గ‌బ్బిలాల మృతికి క‌రోనా కార‌ణం కాద‌ని, ఎండ వేడిమి కార‌ణంగా అవి మృతి చెందాయ‌ని మెడిక‌ల్ రిపోర్టులో వెల్ల‌డ‌య్యింది. 

Updated Date - 2020-05-31T17:34:42+05:30 IST