Advertisement
Advertisement
Abn logo
Advertisement

సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా వదలని వైసీపీ సభ్యులు.. చంద్రబాబును కించపరుస్తూ వ్యాఖ్యలు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా వైసీపీ సభ్యులు ఏమాత్రం తగ్గలేదు. వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబును కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభ్యులను రెచ్చగొడుతూ.. జగన్‌ సహా వైసీపీ సభ్యులు కామెంట్లు చేశారు. కుప్పంలో ఓటమిని అడ్డుపెట్టుకుని చంద్రబాబుపై అవహేళనతో కూడిన దాడికి పాల్పడ్డారు. ఈ రోజు సమావేశం ప్రారంభం కాగానే చంద్రబాబుపై మంత్రులు కన్నబాబు, కొడాలి నాని ఏకపక్ష దాడికి పాల్పడ్డారు. హెరిటేజ్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్య దాడి చేశారు. సెక్స్‌ స్కాండల్స్‌ ఆరోపణలు ఎదుర్కొన్న అంబటి రాంబాబు సైతం.. చంద్రబాబు కుటుంబంపై అసభ్య పదజాలంతో ప్రసంగాలు చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర కలత చెందిన చంద్రబాబు.. సభలో కన్నీరు పెట్టారు. ఆవేదనతో మాట్లాడిన చంద్రబాబును అడుగడుగునా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఆవేదనతో చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ వైసీపీ పతనం చూశాక ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి చంద్రబాబు వెళ్లిపోయారు. 

Advertisement
Advertisement