Abn logo
Nov 22 2020 @ 16:17PM

డ్రగ్స్ కేసు: నిన్న కమెడియన్ భారతిసింగ్.. నేడు ఆమె భర్త అరెస్ట్

Kaakateeya

ముంబై: మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కమెడియన్ భారతిసింగ్‌ను నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ ఉదయం ఆమె భర్త హర్ష్ లింబాచియా (33)ను అరెస్ట్ చేశారు. స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, టీవీ నటుడు అయిన లింబాచియాను 15 గంటలపాటు విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అనంతరం తమ అదుపులోకి తీసుకున్నారు. భారతిసింగ్, లింబాచియాలను వచ్చే నెల 4వ తేదీ వరకు జుడీషియల్ కస్టడీకి తరలించారు.


యాంటీడ్రగ్స్ బ్యూరో అధికారులు నిన్న ముంబైలోని భారతిసింగ్, హర్ష్ లింబాచియా ఇంటిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరినీ విచారణ కోసం ముంబైలోని కార్యాలయానికి తరలించారు. తాము మాదకద్రవ్యాలను వినియోగిస్తామని విచారణలో వారిద్దరూ అంగీకరించారు. ఈ కేసులో నేరం నిరూపితమైతే వారికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement