Advertisement
Advertisement
Abn logo
Advertisement

చితిలో కాలుతున్న శవాన్ని బయటకు తీసి క్షుద్ర పూజలు... ఫలితం లేకపోవడంతో...

మహరాజ్‌గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో జగుప్సాకరమైన మూఢాచారాలతో కూడుకున్న ఉదంతం వెలుగుచూసింది. పాము కాటుకు ఒక బాలిక మృతి  చెందగా, ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్మశాన వాటికకు తీసుకువెళ్లారు. అయితే ఇంతలోనే చితిలో కాలుతున్న ఆ శవాన్ని బయటకు తీసి, దాని ఎదుట 24 గంటలపాటు క్షుద్ర పూజలు నిర్వహించారు. 

ఈ ఉదంతం కోఠీభార్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సబ్యాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఛోట్‌కన్ అనే వ్యక్తి కుమార్తె(15) పాము కాటుకు గురైంది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆ బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు ఆ బాలికను పరీక్షించి, అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. దీంతో బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్మశానవాటికకు తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా, ఎవరో సలహా ఇవ్వడంతో చితిలో కాలుతున్న మృతదేహాన్ని వెంటనే బయటకు తీసి, క్షుద్ర పూజలు చేశారు. ఆ బాలిక తిరిగి బతుకుతుందనే మూఢనమ్మకంతో కుటుంబ సభ్యులు ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే ఎంతసేపు క్షుద్ర పూజలు చేసినప్పటికీ ఆ బాలిక మృతదేహంలో చలనం లేకపోవడంతో తిరిగి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement