‘రాముడి పాత్ర నా నటజీవితాన్ని నాశనం చేసేసింది’

ABN , First Publish Date - 2020-02-02T23:08:08+05:30 IST

సినిమాల్లో రాముడు, కృష్ణుడు పాత్రలు వేసేవారిని ప్రేక్షకులు నిజమైన దేవుళ్లలానే ఆదరిస్తారు. వారిపై అపరిమితమైన భక్తి చూపిస్తారు.

‘రాముడి పాత్ర నా నటజీవితాన్ని నాశనం చేసేసింది’

సినిమాల్లో రాముడు, కృష్ణుడు పాత్రలు వేసేవారిని ప్రేక్షకులు నిజమైన దేవుళ్లలానే ఆదరిస్తారు. వారిపై అపరిమితమైన భక్తి చూపిస్తారు. అయితే అలాంటి పాత్ర వేయడమే తన నటజీవితాన్ని చంపేసిందని వాపోతున్నాడు. అరుణ్ గోవిల్. 1980లలో వచ్చిన ‘రామాయణ్’. హిందీ టీవీ సీరియల్‌లో ఆయన రాముడి పాత్ర పోషించారు. ఆ సీరియల్ తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలివ్వలేదని అరుణ్ చెప్పారు. తన పాత్ర ఏం చేసినా.. ‘రామా.. ఏం చేస్తున్నావ్ నువ్వు?’ అంటూ ప్రేక్షకులు ప్రశ్నించడం మొదలెట్టారని, దీంతో తన నటజీవితం నాశనమైపోయిందని అరుణ్ వాపోయారు. ఆ సమయంలోనే తను ఇక ఈ ఇండస్ట్రీలో ఏమీ చేయలేననే కఠిన నిజం తెలిసొచ్చిందని చెప్పారు.

Updated Date - 2020-02-02T23:08:08+05:30 IST