విమర్శలకు తలొగ్గిన బీజేపీ.. సెంగార్ భార్యకు టికెట్ కేన్సిల్

ABN , First Publish Date - 2021-04-11T22:37:41+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో అత్యాచార కేసు దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు పంచాయతీ

విమర్శలకు తలొగ్గిన బీజేపీ.. సెంగార్ భార్యకు టికెట్ కేన్సిల్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో అత్యాచార కేసు దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు పంచాయతీ ఎన్నికల్లో టికెట్ కేటాయించి విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ వెనక్కి తగ్గింది. అత్యాచారం ఆరోపణలతో జైలు పాలైన తర్వాత సెంగార్‌ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో డిసెంబర్ 2019న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సెంగార్‌కు జీవిత ఖైదు విధించింది. తాజాగా, ఆయన భార్య సంగీత సెంగార్‌ను జిల్లా పంచాయత్ ఎన్నికల్లో ఫతేపూర్ చౌరాసి త్రిటయ సీటు నుంచి బీజేపీ బరిలోకి దింపింది.


అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి భార్యకు, అందునా పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తి భార్యకు టికెట్  ఇవ్వడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విపక్షాలు అయితే దుమ్మెత్తిపోశాయి. దీంతో స్పందించిన బీజేపీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ తెలిపారు. ఆ స్థానానికి కొత్తగా ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపించాలని ఉన్నావో జిల్లా అధ్యక్షుడిని కోరినట్టు చెప్పారు.  

Updated Date - 2021-04-11T22:37:41+05:30 IST