భర్త మరణం.. మరిదిని పెళ్లాడేందుకు ప్రయత్నించి విఫలం.. చివరకు ఆ భార్య ఎంతకు తెగించిందంటే..

ABN , First Publish Date - 2021-07-19T21:44:12+05:30 IST

డబ్బుపై తనకు ఉన్న అత్యాశతో ఆ కోడలు ఘాతుకానికి ఒడిగట్టింది. హార్ట్ ఎటాక్‌తో భర్త మరణించగానే అతని సోదరుడు అంటే తన మరిదిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింది.

భర్త మరణం.. మరిదిని పెళ్లాడేందుకు ప్రయత్నించి విఫలం.. చివరకు ఆ భార్య ఎంతకు తెగించిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: డబ్బుపై తనకు ఉన్న అత్యాశతో ఆ కోడలు ఘాతుకానికి ఒడిగట్టింది. హార్ట్ ఎటాక్‌తో భర్త మరణించగానే అతని సోదరుడు అంటే తన మరిదిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ పెళ్లికి ఆమె మామయ్య ససేమిరా అనడంతో కోపం తెచ్చుకుంది. కోటి రూపాయల వరకూ ఆస్తులు స్వాధీనం చేసుకుంది. అయినా సరే ఆమె ధన దాహం తీరలేదు. మామయ్య వద్ద ఉన్న 13 ఎకరాల్లో తనకు సగం ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే పెద్ద కొడుకు భార్య హోదా చూపించి ఇప్పటికే రూ.కోటి తమ వద్ద వసూలు చేసిన ఆమెకు పొలాలు కూడా ఇవ్వడానికి ఆ వృద్ధరైతు నిరాకరించాడు. పొలం తన రెండో కుమారుడికే కట్టబెడతానని చెప్పాడు. దీంతో ఆ కోడలు.. తండ్రి వంటి మామయ్యను హత్య చేయించింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది. 


సత్యపాల్ అనే ధనిక రైతుకు ఇద్దరు పిల్లలు. వారిలో సంజయ్ (32)కు షాలిని (30) అనే యువతితో 2014లో పెళ్లి చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సంజయ్ బాగానే సంపాదించేవాడు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ ఢిల్లీలో నివశించే వారు. అక్కడ ఉండగానే 2018లో గుండెపోటుతో సంజయ్ కన్నుమూశాడు. అంతే.. షాలిని కన్ను అత్తారింటి ఆస్తులపై పడింది. భర్త కొన్న ఫ్లాట్, నగలు, డబ్బు.. ఇలా సుమారు రూ.కోటి విలువ చేసే వస్తువులను దండుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మొత్తం ఆస్తి కాజేయడం కోసం సంజయ్ సోదరుడితో తన పెళ్లి చేయాలని సత్పాల్‌పై షాలిని కుటుంబం ఒత్తిడి తెచ్చింది. దీనికి సత్పాల్ అంగీకరించలేదు.


మరిదితో పెళ్లికి మామయ్య ఒప్పుకోకపోవడంతో షాలినికి కోపం వచ్చింది. సంజయ్ స్నేహితుడైన విపిన్‌తో అక్రమ సంబంధం పెట్టుకొని సత్పాల్‌ నుంచి ఆస్తి కాజేయడానికి అతన్ని ఉపయోగించుకుంది. సత్పాల్ వద్ద ఉన్న 13 ఎకరాల్లో పెద్దకుమారుడి వాటాగా సగం తనకు ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ గొడవ పంచాయతీకి చేరడంతో ఆమెకు ఏటా రూ.80వేలు ఇచ్చేలా సత్పాల్ ఒప్పందం చేసుకున్నాడు. అయినా సరే షాలిని ఆశ చావలేదు. అందుకే విపిన్‌తో కలిసి పథకం వేసింది. తన మామయ్యను చంపేస్తే రూ.5లక్షలు ఇస్తానని ఇద్దరు షూటర్లకు ఆఫర్ ఇచ్చింది. వాళ్లు అతన్ని జూన్ 28న షూట్ చంపేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు షాలిని మాస్టర్ ప్లాన్ తెలిసి మైండ్ బ్లాకైంది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులు, విపిన్ తదితరులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు షూటర్లు మాత్రం తప్పించుకున్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2021-07-19T21:44:12+05:30 IST