Abn logo
Sep 22 2021 @ 16:10PM

SONU SOOD : ‘‘నా ఇంటి ముందు వందలాదిగా జనం... కొందరు ఏడుస్తున్నారు కూడా!’’

‘‘ఇంతకు ముందెప్పుడూ లేనంత జోష్‌లో ఉన్నాను’’ అంటున్నారు సోనూ సూద్. నాలుగు రోజులు పాటూ ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన తరువాత సోనూ స్పందన ఇది. తనకు దాచేందుకు ఏమీ లేదంటోన్న హ్యాండ్సమ్ యాక్టర్, తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీ అని ప్రకటించాడు.


‘‘ఐటీ అధికారులు వారి పని వారు చేశారు. నేను కూడా నా పని చేస్తూ ముందుకు సాగుతాను. నేను ఉన్నా లేకున్నా ఈ మంచి పని మాత్రం ఆగిపోకూడదు’’ అంటూ తన మనసులో మాట బయటపెట్టారు సూద్. అంతే కాదు, ఆయన తన ఇంటి ముందు గుమికూడిన వందలాది మంది గురించి కూడా ప్రస్తావించారు. వారంతా తన యోగక్షేమాల కోసం తల్లడిల్లుతున్నారని, చాలా మంది ఏడ్చేస్తున్నారని ఎమోషనల్‌గా చెప్పారు. అటువంటి జనం వల్లే తాను ఐటీ రైడ్స్ తరువాత కూడా ఉత్సాహంగా ఉండగలుగుతున్నానని వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption