ఆ పులి దొరికే వరకూ.... ఆ Zooకి లక్షల్లో నష్టం

ABN , First Publish Date - 2021-12-07T18:33:32+05:30 IST

డోర్‌లోని జంతు ప్రదర్శనశాల నుంచి ఇటీవల ఒక చిరుతపులి కనిపించకుండా పోయింది. దీంతో జూ కొన్ని లక్షల ఆదాయాన్ని కోల్పోతోంది. జూ అధికారులు, సిబ్బంది దాని వెదకడంలో నిమగ్నమయ్యారు.

ఆ పులి దొరికే వరకూ.... ఆ Zooకి లక్షల్లో నష్టం

ఇండోర్ : ఇండోర్‌లోని జంతు ప్రదర్శనశాల నుంచి ఇటీవల ఒక చిరుతపులి కనిపించకుండా పోయింది. దీంతో జూ కొన్ని లక్షల ఆదాయాన్ని కోల్పోతోంది. జూ అధికారులు, సిబ్బంది దాని వెదకడంలో నిమగ్నమయ్యారు. చిరుతపులి దొరికే వరకూ జూకి సందర్శకులను అనుమతించవద్దని నిర్ణయించారు. దాదాపు ఏడు రోజులుగా జూను మూసివేశారు. దీని కారణంగా జూ లక్షల్లో ఆదాయాన్ని కోల్పోతోంది. సదరు చిరుత గాయపడింది. అది ఇప్పటికీ కమల నెహ్రూ జూలాజికల్ పార్కులోనే ఉండి ఉంటే ఈపాటికి ఆకలితో అలమటించేది. కాబట్టి జూలో లేదని నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాలు పరిశీలించినప్పటికీ ఇదే విషయం స్పష్టమైంది. 7 నెలల చిరుత ఆనవాళ్లు ఎక్కడా సీసీ కెమెరాలకు కూడా చిక్కలేదు. 


జూ పార్కును రోజుకు ఎంతమంది సందర్శిస్తుంటారంటే...


సోమవారం జూ అధికారులు సంవాద్ నగర్, ఆజాద్ నగర్ నివాస ప్రాంతాల్లో గాలించినప్పటికీ చిరుత ఆనవాళ్లు కనిపించలేదు. జూ అధికారుల కథనం ప్రకారం.. ఇండోర్ జూను చలికాలంలో ప్రతి రోజూ 4,500 విజిటర్స్ సందర్శిస్తుంటారు. జూ‌లోకి ప్రవేశించేందుకు టికెట్ ధర వచ్చేసి రూ.20. ఇది కాకుండా జూలో స్నేక్ పార్క్, పక్షి శాల ఉంది. వీటిని సందర్శించేందుకు వరుసగా రూ.5, రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. స్నేక్ హైస్‌ను ప్రతి రోజూ 4,000 మంది సందర్శకులు సందర్శిస్తుంటారు. ఇక పక్షిశాలను కనీసం వెయ్యి మంది సందర్శిస్తుంటారు. ఇక ప్రతిరోజు జూ పార్క్ కనీస ఆదాయం వచ్చేసి ఎంట్రీ చార్జీలే రూ.90 వేల నుంచి రూ.1.4 లక్షల వరకూ ఉంటాయి. ఇక పక్షి శాలకు రూ.30 వేలు, స్నేక్ పార్క్ ఆదాయం రూ.20 వేలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 


గాయపడిన చిరుతను చికిత్స నిమిత్తం...


డిసెంబర్ 1న చిరుతపులి వెనుక కాళ్లకు గాయాలయ్యాయి. దీనిని డిసెంబర్ 1న బుర్హాన్‌పూర్‌లోని నేపానగర్‌లో రక్షించారు. ఆ తరువాత దానిని చికిత్స కోసం ఇండోర్ జూ లోని కేజ్‌కి తరలించారు. డిసెంబర్ 1 రాత్రి సమయంలో సిబ్బంది వచ్చి వాహనం, బోనును ఒక బొంతతో కప్పి బహిరంగ ప్రదేశంలో వదిలివేశారు. ఉదయం వచ్చి చూసేసరికి చిరుత కనిపించలేదు. బోనులోని చిన్న హోల్ ద్వారా చిరుత తప్పించుకున్నట్టు గుర్తించారు. అప్పటి నుంచి ఇండోర్ జూ సిబ్బంది టీమ్‌లుగా విడిపోయి చిరుత కోసం గాలిస్తోంది. స్నిఫర్ డాగ్‌లను రంగంలోకి దించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తమ్మీద ఒక్క చిరుత తప్పించుకోవడంతో జూ లక్షల్లో నష్టాలను ఎదుర్కోవల్సి వస్తోంది.

Updated Date - 2021-12-07T18:33:32+05:30 IST