వచ్చే ఏడాది నుంచి మిలటరీ స్కూళ్లు,కళాశాలల్లో బాలికలకు ప్రవేశం

ABN , First Publish Date - 2021-10-07T18:00:19+05:30 IST

మిలటరీ స్కూళ్లు,కళాశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది...

వచ్చే ఏడాది నుంచి మిలటరీ స్కూళ్లు,కళాశాలల్లో బాలికలకు ప్రవేశం

న్యూఢిల్లీ :మిలటరీ స్కూళ్లు,కళాశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షల్లో బాలికలకు వచ్చే ఏడాది నుంచి అనుమతించాలని కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ నిర్ణయించింది. రక్షణ మంత్రిత్వశాఖ నడుపుతున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీతోపాటు రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ స్కూళ్లలో బాలికలకు అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. బాలికలకు ప్రవేశం కల్పించేందుకు వీలుగా సైనిక కళాశాలల్లో సీట్ల సంఖ్యను దశలవారీగా పెంచనున్నారు. దీంతోపాటు సైనిక స్కూళ్లు,కళాశాలల్లో అదనంగా వసతి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.


వచ్చే ఏడాది నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బాలికలు పరీక్ష రాసేందుకు సన్నద్ధమవ్వాలని రక్షణ మంత్రిత్వశాఖ సూచించింది. మొదటి విడతగా మిలటరీ కళాశాలల్లో సీట్ల సంఖ్యను 250 నుంచి 300కు పెంచాలని నిర్ణయించారు. సైనికస్కూళ్లు, కళాశాలల్లో బాలికల ప్రవేశానికి వచ్చే ఏడాది జూన్ నెలలో ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తామని రక్షణమంత్రిత్వశాఖ తెలిపింది. రెండో దశలో సీట్ల సంఖ్యను 300 నుంచి 350కు పెంచాలని నిర్ణయించారు.


Updated Date - 2021-10-07T18:00:19+05:30 IST