‘మధ్యాహ్న భోజనం’ ఆలస్యం

ABN , First Publish Date - 2021-10-24T05:12:58+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 23: మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనాలు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, చినజగ్గంపేట, చేబ్రోలు, దుర్గాడ, ఏకేమల్లవరం, ఏపీ మల్లవరం, వన్నెపూడి తదితర గ్రామాల్లో పాఠశాలలకు శనివారం

‘మధ్యాహ్న భోజనం’ ఆలస్యం
తాటిపర్తి ఈతతోట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నిరీక్షిస్తున్న విద్యార్థులు

ఇబ్బందులు పడిన విద్యార్థులు 

చర్యలు తీసుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 23: మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనాలు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, చినజగ్గంపేట, చేబ్రోలు, దుర్గాడ, ఏకేమల్లవరం, ఏపీ మల్లవరం, వన్నెపూడి తదితర గ్రామాల్లో పాఠశాలలకు శనివారం నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటల ఆలస్యంగా భోజనాలు వచ్చాయి. దీంతో మధ్యాహ్నం జరిగే పార్మాటివ్‌-1 పరీక్షకు విద్యార్థులు ఆలస్యంగా హాజరయ్యారు. తరచూ భోజనాలు ఆలస్యం అవుతుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో ఉండకుండానే గృహాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా భోజనాలు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


ఆకలితో ఇంటికి వెళ్లిన విద్యార్థులు

కొత్తపల్లి, అక్టోబరు 23: కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్న భోజనాలు పాఠశాలలకు ఆలస్యంగా చేరడంతో విద్యార్థులు చాలామంది ఆకలితో ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రతీరోజూ  ఉదయం 10గంటలోపే మధ్యాహ్న భోజనం ఆయా పాఠశాలలకు సరఫరా జరిగేది. శనివారం మండలంలోని పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మఽధ్యాహ్నం సుమారు 1గంట దాటిన తర్వాత నిర్వాహకులు భోజనాలు సరఫరా చేశారు. దీంతో అప్పటి వరకు ఖాలీ కంచాలతో భోజనాల కోసం ఎదురు చూసిన విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.

Updated Date - 2021-10-24T05:12:58+05:30 IST