Abn logo
Sep 20 2021 @ 20:21PM

పెళ్లి చూపుల కోసం యువతి ఫొటోను పంపిస్తే.. ఆ కుర్రాడు చేశాడో పాడు పని.. విషయం తెలిసి పెళ్లికి నో చెప్పిందని.

ఇంటర్నెట్ డెస్క్: ఆ రెండు కుటుంబాల మధ్య పెళ్లి మాటలు జరుగుతున్నాయి. ఇంకా సంబంధం కుదరలేదు. ఈలోపు.. అమ్మాయి ఫొటో పంపించండని అబ్బాయి తరుఫు వారు కోరడంతో వధువు తల్లిదండ్రులు తమ కూతురి ఫొటోను పంపించారు. కానీ.. వరుడు మాత్రం ఎవ్వరూ ఊహించలేని దారుణానికి పాల్పడ్డాడు. బీహార్‌ రాష్ట్రం సీతామడీ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. 

ప్రణయ్ చౌదురీ అనే యువకుడితో యువతి తల్లిదండ్రులు చర్చలు జరపుతున్నారు. సంబంధం ఇంకా కుదరలేదు. అయితే..అమ్మాయి ఫొటో పంపించాలని అబ్బాయి తరఫు వారు కోరారు. ఈ క్రమంలో ప్రణయ్ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అమ్మాయి ఫొటోను ఆమె అనుమతి లేకుండా ఎడిట్ చేసి..సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అది వైరల్ అయింది. విషయం తెలియడంతో ఆగ్రహించిన యువతి ఈ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. 

ఇవీ చదవండి:

మగాళ్లు కలలో కూడా ఊహించలేని కండీషన్లను భర్తకు పెట్టిందో భార్య..

కృత్రిమ గర్భానికి డబ్బుల్లేక.. వీర్యదానం చేసే వ్యక్తిని నేరుగా ఇంటికి రప్పించి..


దీంతో.. రెచ్చిపోయిన ప్రణయ్ ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆమెను బెదిరించి.. ఓ అస్లీల వీడియో చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశాడు. ఇలా ఊహించని విధంగా అతడి పైశాచికత్వానికి బలైపోవడంతో యువతి అయోమయ స్థితిలోకి వెళ్లిపోయింది. నిద్రాహారాలు కూడా మానేసింది. కూతురి స్థితి చూసి తల్లడిల్లిపోయిన ఆమె తండ్రి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే..నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...