Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేయసితో బెడిసికొట్టిన వ్యవహారం.. పక్కా ప్లాన్‌తో ఆమె పేరుతోనే ఓ సిమ్‌కార్డును కొని ఈ 19 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 19ఏళ్ల వయసు. మైనర్ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగాడు. దీంతో ఆ అమ్మాయి.. అతడి ప్రేమను అంగీకరించింది. దీంతో కొన్ని రోజులపాటు సరదాగా తిరిగారు. ఇంతలో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. ఆ తర్వాత గొడవలు ముదిరాయి. ఈ నేపథ్యంలోనే ఆ కుర్రాడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పక్కా ప్లాన్‌లో ఆమె పేరుతోనే ఓ సిమ్‌కార్డును తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌కు చెందిన విక్రమ్ అనే కుర్రాడు.. 16ఏళ్ల వయసు ఉన్న 12వ తరగతి అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. నచ్చావంటూ ఆమె వెంటే తిరిగాడు. పెళ్లి చేసుకుంటానని.. బాగా చూసుకుంటానని చెప్పడంతో అతడి మాటలను ఆ అమ్మాయి నమ్మింది. అతడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పార్కులకు, సినిమాలకు తిరిగారు. మూడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలారు. ఇంతలో ఏమైందో కానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. మనస్పర్థలు కాస్తా తారా స్థాయికి చేరి.. వ్యవహారం ఇద్దరూ విడిపోయే వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే విక్రమ్.. నవంబర్ 1న ఆమెకు ఫోన్ చేశాడు. తనను కలిసేందుకు బయటకు రావాలని కోరాడు. ఎవరికీ చెప్పొందు అని కూడా సూచించాడు. దానికి ఆమె కూడా అంగీకరించింది. ఎవరికీ చెప్పకుండానే అతడిని కలిసేందుకు స్థానికంగా నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లింది. అక్కడ వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి లోనైన విక్రమ్.. ఆమెను పదునైన రాయితో కొట్టి చంపాడు. 


ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలోనే నవంబర్ 2న కొందరు స్థానికులు ఆ అమ్మాయి మృతదేహాన్ని గుర్తించి పోలీసుకుల సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. ఆమె కాల్ డేటాను పరిశీలించారు. ఆమెకు వచ్చిన చివరి ఫోన్ కాల్ నెంబర్.. మృతురాలి పేరుపైనే ఉండటంతో తొలుత అవాక్కయ్యారు. ఆ తర్వాత మరింత లోతుగా విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే సంచలన విషయం బయటపడింది. విక్రమ్.. కొంత కాలంగా బాధితురాలితో ప్రేమాయణం నడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ అమ్మాయి పేరుపై తానే మొబైల్ నెంబర్ తీసుకుని.. ఆ నెంబర్‌తోనే ఫోన్ చేసి బయటకు రమ్మనట్లు విక్రమ్ అంగీకరంచాడు. ప్రేమ వ్యవహారం బెడిసికొట్టినందుకే ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో విక్రమ్‌ను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement