Abn logo
Aug 13 2020 @ 00:07AM

విరామం తర్వాత!

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. ఇందులో న్యాయవాదిగా పవన్‌ కనిపించనున్న సంగతి తెలిసిందే. విరామం తర్వాత ఈ చిత్రం పనులు పునఃప్రారంభించామని సంగీత దర్శకుడు తమన్‌ తెలిపారు. ఈ చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా రాకముందు మార్చిలో కొంత చిత్రీకరణ చేశారు. మళ్లీ ఇప్పుడు సెట్స్‌ మీదకు వెళ్లడం లేదు గానీ... సంగీతపరమైన పనులు మాత్రం మొదలుపెట్టారు. ‘‘పవర్‌స్టార్‌ అనేసరికి ఏదో తెలియని శక్తి నాలో ప్రవహిస్తుంది’’ అని తమన్‌ అన్నారు. ఇప్పటి వరకూ చిత్రీకరించిన సన్నివేశాలకు నేపథ్య సంగీతం అందిస్తున్నారని సమాచారం. సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు. అప్పుడు టీజర్‌ ఏదైనా విడుదల చేస్తారేమో చూడాలి. బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్యా నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement