రైతుల తర్వాత కార్మికులే టార్గెట్‌ : రాహుల్‌

ABN , First Publish Date - 2020-09-25T06:58:28+05:30 IST

రైతుల తర్వాత కార్మికులే మోదీ సర్కారుకు టార్గెట్‌ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు...

రైతుల తర్వాత కార్మికులే టార్గెట్‌ : రాహుల్‌

  • దిశానిర్దేశం లేని విపక్షాల రాజకీయం: జావడేకర్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 : రైతుల తర్వాత కార్మికులే మోదీ సర్కారుకు టార్గెట్‌ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. 3 కార్మిక బిల్లులు పార్లమెంట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో గురువారం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు విధానాలను ప్రియాంక గాంధీ కూడా తప్పుబట్టారు.  విపక్షాల రాజకీయాలు దిశానిర్దేశం లేకుండా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. బిల్లులపై సభలో చర్చకు అవకాశం వచ్చినా వాకౌట్‌ చేయడమేమిటంటూ మండిపడ్డారు. కార్మిక బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. కాగా, కనీసమద్దతు ధర అంశం బిల్లులో లేదని కానీ దానిని కొనసాగిస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వివరించారు. కాగా, వ్యవసాయ, కార్మిక బిల్లులను ప్రభుత్వం హడావుడిగా ఆమోదింపచేసుకుందని ఎన్సీపీ ఆరోపించింది. ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వమని ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్‌ తపసే ఆరోపించారు. 

Updated Date - 2020-09-25T06:58:28+05:30 IST