Advertisement
Advertisement
Abn logo
Advertisement

సారీ చెబుతానని హోటల్‌కు రమ్మన్నాడు.. నమ్మి వెళ్లిన బాలికపై ఘోరానికి పాల్పడ్డాడు.. నాలుగో రోజుల పాటు..

వారిద్దరూ పక్క పక్క ఇళ్లలో నివసిస్తుంటారు.. ఆ బాలికతో ఆ యువకుడు తరచుగా మాట్లాడుతుంటాడు.. దీనిని గమనించిన బాలిక తల్లిదండ్రులు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు.. దీంతో ఆ యువకుడు బాలిక తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు.. దాంతో బాలిక అతడితో మాట్లాడడం మానేసింది.. దీంతో యువకుడు పక్కా ప్లాన్ వేశాడు.. హోటల్‌కు వస్తే అన్నీ మాట్లాడుకుందామని, క్షమాపణ చెబుతానని ఆ బాలికకు చెప్పాడు.. అతడి మాటలను నమ్మిన బాలిక హోటల్‌కు వెళ్లింది.. అక్కడ ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. 


గ్వాలియర్‌కు చెందిన శివమ్ అనే యువకుడు తన పక్కింట్లో ఉండే పదో తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండేవాడు. తరచుగా ఆ బాలికతో మాట్లాడేవాడు. ఆ విషయాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు శివమ్‌కు వార్నింగ్ ఇచ్చారు. తమ కూతురితో మళ్లీ మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో వారితో శివమ్ గొడవకు దిగాడు. ఆ గొడవ పెద్దది కావడంతో బాలిక పూర్తిగా శివమ్‌తో మాట్లాడడం మానేసింది. దీంతో శివమ్ ఆమెను బతిమాలాడు. హోటల్‌కు వస్తే అన్ని మాట్లాడుకుందామని నమ్మించాడు. 


అతడి మాటలు నమ్మిన బాలిక గత ఆదివారం అతడు చెప్పిన హోటల్‌కు వెళ్లింది. ఆ బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లిన యువకుడు అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఇంటికి వెళ్లి ముభావంగా ఉండిపోయింది. నాలుగు రోజుల పాటు తన గదిలో నుంచి బయటకు రాలేదు. కూతురి ప్రవర్తన గమనించిన తల్లి విషయం ఏంటని ఆరా తీసింది. దీంతో ఆ బాలిక విషయం మొత్తం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలికతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్  ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివమ్‌ను అదుపు లోకి తీసుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement