కన్వర్ యాత్రను రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-19T01:08:36+05:30 IST

ఈ ఏడాది కన్వర్ యాత్రను రద్దు చేసిన రాష్ట్రాల్లో తాజాగా ఢిల్లీ కూడా వచ్చి చేరింది. కన్వర్..

కన్వర్ యాత్రను రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఈ ఏడాది కన్వర్ యాత్రను రద్దు చేసిన రాష్ట్రాల్లో తాజాగా ఢిల్లీ కూడా వచ్చి చేరింది. కన్వర్ యాత్రను రద్దు చేస్తున్నట్టు ఆదివారంనాడు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ యాత్రను రద్దు చేశాయి. ఊరేగింపులు, జనం గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున యాత్ర రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ తెలిపింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కన్వర్ యాత్రను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన మరుసటి రోజే ఢిల్లీ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది.


కన్వర్ యాత్రను రద్దు చేస్తున్నట్టు ఉత్తరాఖండ్ సర్కార్ ముందుగానే ప్రకటించగా, ఆంక్షలతో అనుమతి ఇస్తున్నట్టు తొలుత ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం  ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగొచ్చింది. కన్వర్ యాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏటా కన్వర్ యాత్ర జూలై చివరి వారంలో ప్రారంభమై ఆగస్టు మొదటి వారం వరకూ జరుగుతుంటుంది. యూపీ, హర్యానా, ఢిల్లీలోని వేలాది మంది శివభక్తులు (కన్వరీలు) కాలి నడకన గంగా జలాలను సేకరించేందుకు హరిద్వార్‌కు ఈ యాత్ర చేస్తుంటారు.

Updated Date - 2021-07-19T01:08:36+05:30 IST