వ్యాక్సిన్‌ తర్వాత కొవిడ్‌?

ABN , First Publish Date - 2021-05-11T16:59:42+05:30 IST

మొదటి డోసు వ్యాక్సిన్‌కు, బూస్టర్‌ డోసుకు మధ్య 6 నుంచి 8 వారాల సమయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొవిడ్‌ బారిన పడితే రెండవ బోసు వ్యాక్సిన్‌ ఎప్పుడు వేయించుకోవాలనే విషయంపై అయోమయం

వ్యాక్సిన్‌ తర్వాత కొవిడ్‌?

ఆంధ్రజ్యోతి(11-05-2021)

మొదటి డోసు వ్యాక్సిన్‌కు, బూస్టర్‌ డోసుకు మధ్య 6 నుంచి 8 వారాల సమయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొవిడ్‌ బారిన పడితే రెండవ బోసు వ్యాక్సిన్‌ ఎప్పుడు వేయించుకోవాలనే విషయంపై అయోమయం నెలకొని ఉంది. అయితే వైద్య మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత రెండో డోసు వేయించుకునేలోపు కొవిడ్‌ సోకితే, కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత బూస్టర్‌ డోసు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని వైద్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. అయితే కొవిడ్‌ లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు, ప్లాస్మా లేదా యాంటీ కొవిడ్‌ - 19 మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ పొందినవాళ్లు, ఇతరత్రా వ్యాధులపరంగా తీవ్ర అస్వస్థతలకు లోనయినవారికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది.

Updated Date - 2021-05-11T16:59:42+05:30 IST