Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల బాలిక.. చాక్లెట్ ఇస్తానని పిలిచిన 13 ఏళ్ల బాలుడు.. ఆ వీడియోల ప్రభావంతో..

ప్రస్తుత కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసుల పేరుతో చిన్న పిల్లలకు కూడా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల వారికి మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా పోర్న్ వీడియోలు చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. చిన్న వయసులోనే శృంగారంపై లేని పోని ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలుడు పోర్న్ వీడియోల ప్రభావానికి గురై మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 13 ఏళ్ల వయసులో కటకటాల పాలయ్యాడు. 


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మూడున్నరేళ్ల బాలిక సోమవారం సాయంత్రం తన ఇంటి బయట ఆడుకుంటోంది. పక్కింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలుడు ఆమెను చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి రమ్మన్నాడు. అనంతరం ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నొప్పి కారణంగా ఏడవడంతో అక్కణ్నుంచి పారిపోయాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన బాలిక తలిదండ్రులకు విషయం చెప్పింది. ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ తీసుకుని గూగుల్ హిస్టరీ చెక్ చేయగా అన్నీ పోర్న్ వీడియోలు, నగ్న చిత్రాలే కనిపించాయి. కొన్ని నెలలుగా ఆ బాలుడు పోర్న్ వీడియోలే చూస్తున్నాడు. ఆ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement