నేను పీఎం కాగానే, మోదీ దృష్టికి ఆ సంగతి తీసుకెళ్లా : ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2021-02-25T02:12:38+05:30 IST

ఉపఖండంలో భేదాభిప్రాయాల పరిష్కారానికి చర్చలే శరణ్యమని

నేను పీఎం కాగానే, మోదీ దృష్టికి ఆ సంగతి తీసుకెళ్లా : ఇమ్రాన్ ఖాన్

కొలంబో : ఉపఖండంలో భేదాభిప్రాయాల పరిష్కారానికి చర్చలే శరణ్యమని తాను ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన వెంటనే భారత్‌కు చెప్పానని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఉపఖండంలో పేదరికం సమస్యను పరిష్కరించడానికి ఏకైక మార్గం వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవడమేనని తెలిపారు. పాకిస్థాన్-శ్రీలంక వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. 


తాను 2018లో పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన వెంటనే భారత దేశానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ సందేశం పంపించానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే ఉపఖండం ముందు ఉన్న మార్గమని తెలియజేశానన్నారు. తాను ఈ విషయంలో విజయం సాధించలేదని, అయితే ఎప్పటికైనా చర్చలు జరుగుతాయనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవడం ద్వారా మాత్రమే ఉపఖండంలో పేదరికాన్ని పరిష్కరించగలుగుతామని చెప్పారు. యూరోపియన్ల మాదిరిగా నాగరిక ఇరుగు-పొరుగు దేశాలుగా మనం మనుగడ సాగించాలన్నారు. 


మన దేశం గుండా శ్రీలంక వెళ్ళేందుకు ఇమ్రాన్ ఖాన్ విమానానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-02-25T02:12:38+05:30 IST