Sep 18 2021 @ 19:10PM

మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్

‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో..’ హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇది సినిమా అనుకుంటే పొరబాటే. ఈ సక్సెస్‌ఫుల్ కాంబో ఈసారి చేస్తుంది మూవీ కాదు... యాడ్. ఇండియాలో లీడింగ్ బైక్ టాక్సీగా పేరున్న రాపిడోకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ బైక్ టాక్సీ యాడ్ షూట్ కోసం బన్నీ, త్రివిక్రమ్ మరోసారి ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్‌లో వారిద్దరూ డిస్కస్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.