వయసు 9... ప్రపంచ రికార్డు సాధించింది!

ABN , First Publish Date - 2021-04-02T05:53:07+05:30 IST

ఆట వస్తువుగా పనికొచ్చే ‘హులా హూప్‌’ చక్కని వ్యాయామ సాధనం కూడా. రింగ్‌లాంటి ఈ పరికరంతో హర్యాణాకు చెందిన వైష్ణవి గుప్తా అనే తొమ్మిదేళ్ల బాలిక ప్రపంచ రికార్డు సాధించింది.

వయసు 9... ప్రపంచ రికార్డు సాధించింది!

ఆట వస్తువుగా పనికొచ్చే ‘హులా హూప్‌’ చక్కని వ్యాయామ సాధనం కూడా. రింగ్‌లాంటి ఈ పరికరంతో హర్యాణాకు చెందిన వైష్ణవి గుప్తా అనే తొమ్మిదేళ్ల బాలిక ప్రపంచ రికార్డు సాధించింది. 

  • లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువ సమయం ‘హులా హూప్‌’ సాధనకే కేటాయించింది. ‘హులా హూప్‌’ను నడుము చుట్టూ ఎక్కువ సార్లు తిప్పిన బాలికగా వైష్ణవి ప్రపంచ రికార్డు సాధించింది. ఒక్క నిమిషంలోనే 190 సార్లు ‘హులా హూప్‌’ను అది కూడా ఒంటి కాలిమీద నిల్చొని తిప్పింది. 
  • ‘‘‘హూలా హూప్‌’ను నడుము చుట్టూ వేగంగా తిప్పుతున్నప్పుడు ఒక్కోసారి నొప్పి వచ్చేది. అయినా కూడా పట్టువిడవకుండా సాధన చేశాను. రాబోయే రోజుల్లో ‘హులా హూప్‌’ను ఒక్క నిమిషంలోనే 220 సార్లు తిప్పాలని లక్ష్యంతో సాధన చేస్తున్నాను’’ అంటుంది వైష్ణవి. 
  • ‘లాక్‌డౌన్‌ సమయంలో మా పాప ‘హూలా హూప్‌’ మీదే దృష్టి పెట్టింది. మోకాళ్ల చుట్టూ ‘హూలా హూప్‌’ను ఒక్క నిమిషంలో ఎన్నిసార్లు తిప్పాలో లక్ష్యంగా పెట్టుకొని పూర్తయ్యే వరకు ప్రయత్నించేది. వైష్ణవి ప్రపంచ రికార్డు సాధించినందుకు మాతో పాటు తను చదువుతున్న పాఠశాల యాజమాన్యం కూడా ఎంతో సంతోషంగా ఉంది’ అంటున్నారు వైష్ణవి తండ్రి సుమిత్‌ గుప్తా.

Updated Date - 2021-04-02T05:53:07+05:30 IST