గంజాయి సాగుపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-11-28T06:00:27+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు ఆదేశాల మేరకు వై.రామవరం మండలం బొడ్డగండి గ్రామ పంచాయతీలో డొంకరాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింధువాడ బురదకోటా గ్రామాలు, ఆంధ్రా ఒడిసా రాష్ట్రాల సరిహద్దులో అక్రమంగా గంజాయి సాగు జరుగుతోందని పోలీసులు గుర్తించారు.

గంజాయి సాగుపై ఉక్కుపాదం

గంజాయికి నిప్పుపెడుతున్న పోలీసులు
 మోతుగూడెం, నవంబరు 27: ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు ఆదేశాల మేరకు వై.రామవరం మండలం బొడ్డగండి గ్రామ పంచాయతీలో డొంకరాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింధువాడ బురదకోటా గ్రామాలు, ఆంధ్రా ఒడిసా రాష్ట్రాల సరిహద్దులో అక్రమంగా గంజాయి సాగు జరుగుతోందని పోలీసులు గుర్తించారు. చింతూరు సబ్‌డివిజన్‌ ఏఎస్పీ జి.కృష్ణకాంత్‌ ఆధ్వర్యంలో చింతూరు ఎస్‌ఐ యువకుమార్‌, డొంకరాయి ఎస్‌ఐ వెంకట్రావు ఆపరేషన్‌ పరివర్తన కార్యక్రమం ద్వారా గంజాయి పంటను శనివారం ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పదెకరాల్లో సాగుచేస్తున్న రూ.2.5కోట్ల విలువైన పదివేల గంజాయి మొక్కల తోటను ఆదివాసీ రైతు కూలీలు, అటవీశాఖ, ఎక్సైజ్‌ ఎస్‌ఈబీ అధికారులతో కలిసి నిర్వీర్యం చేశామన్నారు. దట్టమైన అటవీ ప్రాంత కొండవాలు గుట్టల మధ్య, ఆంధ్ర ఒడిసా సరిహద్దు భూభాగాల నడుమ స్మగ్లర్లు గంజాయి పంట సాగు చేయడానికి అనువుగా ఎంచుకున్నారన్నారు. గిరిజనులను అడ్డుపెట్టుకుని పంట సాగు చేయించి కాలిబాటన అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఇకపై అలాంటి మాదకద్రవ్యాల కార్యకలాపాలు నిర్వహిస్తే ఎవరినీ వదిలి పెట్టమని హెచ్చరించారు. కాకినాడ ఎస్‌ఈబీ రమాదేవి, ఎస్‌సీ జయరాజు, ఏఈ ఎస్‌.శ్రీనివాసరావు, సీఐ ఆనంద్‌, డీటీఎస్‌ వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు రెవెన్యూ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T06:00:27+05:30 IST