Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు..

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న కెల్విన్‌ను.. మంగళవారం ఈడీ కార్యాలయానికి విచారణకు తీసుకొచ్చారు. మరోవైపు నటుడు నందును.. కెల్విన్ సమక్షంలో విచారించారు. సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. కెల్విన్, అతని మిత్రుడు వాహిద్‌ను కూడా అధికారులు విచారణకు తీసుకొచ్చారు.


మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్ చుట్టే కేసు విచారణ సాగుతోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో పాతబస్తీకి చెందిన కుదూస్, వాహిద్‌ను కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నారు. వీరిద్దరూ కెల్విన్‌తో విదేశాల్లో పరిచయం పెంచుకుని, హైదరాబాద్ వచ్చిన తర్వాత డ్రగ్స్ దందా నడిపినట్లు సమాచారం. వీరంతా కలిసి ఏవిధంగా డ్రగ్స్ సరఫరా చేశారు, నగదు లావాదేవీలు ఎలా చేశారు.. అనే కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు.

Advertisement
Advertisement