Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పలరాజును మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలి

  • రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన వాసా ఎస్‌ దివాకర్‌ డిమాండ్‌

అమలాపురం టౌన, డిసెంబరు 3: గ్రామ రెవెన్యూ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజును మంత్రివర్గం నుంచి తక్షణం భర్తరఫ్‌ చేయాలని రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన వాసా ఎస్‌.దివాకర్‌ డిమాండు చేశారు. వీఆర్వోలకు రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇస్తేనే గ్రామ సచి వాలయాల్లో విధులు నిర్వర్తించగలమని వీఆర్వోల సంఘ డివిజన శాఖ అధ్యక్షుడు సాధనాల యెల్లేశ్వర రావు పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం అమలాపురం తహశీల్దార్‌ కార్యా లయం ఎదుట నిరసన తెలిపారు. వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర చైర్మన దివాకర్‌కు, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తహశీల్దార్‌ గెడ్డం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం దివాకర్‌ ఆధ్వర్యంలో  వీఆర్వోలు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో ఎనఎస్‌వీబీ వసంతరాయుడుకు సమర్పించారు. జిల్లా సంఘం పిలుపు మేరకు వీఆర్వోలు సచివాలయాలకు హాజరు కాకుండా తహశీల్దార్‌ కార్యాలయం నుంచే విధులు నిర్వర్తించారు. నాయకులు కొప్పిశెట్టి వెంకట గణేష్‌, నవుండ్రు జయరాజు, మన్యం, రాజేష్‌, శ్రీఽధర్‌, శివ, సత్యవతి, దొరబాబు, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, కోనే గణపతి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement