అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

ABN , First Publish Date - 2021-04-16T05:40:53+05:30 IST

అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి ఆంజనేయులు అన్నారు.

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన
మార్కాపురంలో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలను చూపిస్తున్న సిబ్బంది

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 15 : అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి ఆంజనేయులు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం గిద్దలూరు పట్టణంలోని రైల్వేస్టేషన్‌, కృష్ణా థియేటర్‌ వద్ద ఆర్టీసీ గ్యారేజీ వద్ద అగ్ని ప్రమాదాలు - నివారణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదంలో జరిగే సమయంలో అప్రమత్తంగా ఉంటే నివారించుకోవచ్చని తెలిపారు. అనంతరం గ్యాస్‌ నుంచి మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఎలా నివారించేలో ప్రదర్శన ద్వారా చూపించారు.  కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. 

కంభంలో..

కంభం : అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా కంభం అగ్నిమాపక శాఖాధికారి కె.ప్రసాదరావు ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్‌,  ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికులకు వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ పద్ధతులను వివరంచడమే కాక కరపత్రాలను పంపిణీ చేశారు. 

మార్కాపురంలో..

మార్కాపురం (వన్‌టౌన్‌) : ప్రజలు అగ్ని ప్రమాదాలు, నివారణపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక అధికారి పి.ఎ్‌స.వెంకటరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో, సుందరయ్య కాలనీలలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గురువారం అవగాహన కల్పించారు. విద్యుత్‌ ప్రమాదాలు నివారణ, గృహాలలో గ్యాస్‌ లీకైతే ఏవిధంగా ఆర్పాలి అనే విధానాలపై ప్రాక్టికల్‌గా వివరించారు.

పెద్ద దోర్నాలలో..

పెద్ద దోర్నాల : అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని  ఆ శాఖ అధికారి జీ వెంకటరావు అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా ముందస్తు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు.  దోర్నాలలో హోటల్‌, టీ వ్యాపారులకు గ్యాస్‌ సిలెండర్‌ వినియోగంపై పలు సూచనలు చేశారు.  ప్రమాదం జరిగితే వెంటనే 101కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.  

Updated Date - 2021-04-16T05:40:53+05:30 IST