ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య కుదిరిన ఒప్పందం

ABN , First Publish Date - 2021-06-21T06:09:39+05:30 IST

రామగుండం ఎన్టీపీ సీ, నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ)ల మధ్య బూడిద సరఫరాకు సం బంధించి శనివారం రాత్రి అవగాహనా ఒప్పం దం(ఎంవోయూ) కుదిరింది.

ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య కుదిరిన ఒప్పందం
ఎంవోయూ పత్రాలు మార్చుకుంటున్న ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు

- జాతీయ రహదారి నిర్మాణానికి 6.66 ఎల్‌సీఎం బూడిద సరఫరా

జ్యోతినగర్‌, జూన్‌ 20 : రామగుండం ఎన్టీపీ సీ, నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ)ల మధ్య బూడిద సరఫరాకు సం బంధించి శనివారం రాత్రి అవగాహనా ఒప్పం దం(ఎంవోయూ) కుదిరింది. 92 కిలో మీటర్ల పరిధిలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన 6.66 లక్షల క్యూబిక్‌ మీటర్ల బూడిదను సరఫరా చేసేందుకు ఎన్‌హెచ్‌ఎఐ, ఎన్టీపీసీల మధ్యం ఎంవోయూ కుదరింది. ఎన్టీపీసీ ఏడఎం బిల్డింగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీపీసీ రామగుండం సీజీఎం సునిల్‌ కుమార్‌, ఎన్‌హెచ్‌ఎఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ రవింద్రరావులు ఎంవోయూ పత్రాలపై సంత కాలు చేశారు. ఎన్‌హెచ్‌ 161 పరిధిలోని కంది నుంచి రాంసాన్‌పల్లె  వరకు 40 కిలో మీటర్ల నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3.01 లక్షల క్యూబిక్‌ మీటర్ల బూడిద, ఎన్‌హెచ్‌ 363 పరిధిలోని రేపల్లెవాడ నుంచి టీఎస్‌, మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన 3.65 ఎల్‌సీఎం బూడిదను అవగాహనా ఒప్పం దం ప్రకారం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎంవోయూ ప్రకారం రానున్న నాలుగు నెలల్లో 6.66 ఎల్‌సీఎం బూడిదను ఎన్టీపీసీ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎన్‌ హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌(సంగారెడ్డి) మధుసూ దన్‌రావు, ఎన్టీపీసీ జీఎం(ఒఅండ్‌ఎం) సౌమేంద్ర దాస్‌, ఎన్టీపీసీ జీఎం(టిక్నికల్‌ సర్వీ సెస్‌) పుష్పేంద్ర కుమార్‌ లాడ్‌, ప్రసే న్‌జిత్‌ పాల్‌(జీఎం, ప్రాజెక్టు), విజయ లక్ష్మి(ఏజీఎం)లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T06:09:39+05:30 IST