దా‘రుణ’ యాప్‌లతో..ఎన్‌బీఎ్‌ఫసీల అగ్రిమెంట్లు!

ABN , First Publish Date - 2021-01-09T07:32:50+05:30 IST

చైనా కేంద్రంగా ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల పేరుతో దా‘రుణాల’కు పాల్పడుతున్న కేసుల్లో.. కాల్‌సెంటర్ల నిర్వాహకులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి కేసులు వస్తాయనే ముందు

దా‘రుణ’ యాప్‌లతో..ఎన్‌బీఎ్‌ఫసీల అగ్రిమెంట్లు!

పత్తాలేని అ కంపెనీల యజమానులు?

ఆర్బీఐ డేటా ఆధారంగా పోలీసుల లేఖలు


హైదరాబాద్‌ సిటీ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): చైనా కేంద్రంగా ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల పేరుతో దా‘రుణాల’కు పాల్పడుతున్న కేసుల్లో.. కాల్‌సెంటర్ల నిర్వాహకులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి కేసులు వస్తాయనే ముందు జాగ్రత్తగా పలు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎ్‌ఫసీ)లతో రుణాలు ఇచ్చేందుకు.. వసూలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ఆర్బీఐ నుంచి అనుమతి పొంది న పలు ఎన్‌బీఎ్‌ఫసీలను ప్రశ్నించేందుకు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. అయితే.. వారెవరు? ఎక్కడుంటారు? అనే డేటా దొరకలేదని, పత్తాలేకుండా పోయారని ఓ అధికారి తెలిపారు. ఆర్బీఐ వద్ద ఉన్న డేటా ఆధారంగా.. రిజిస్ట్రేషన్‌ సమయంలో సమర్పించిన దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఎన్‌బీఎ్‌ఫసీలకు లేఖలు రాస్తున్నట్లు వివరించారు. కాల్‌సెంటర్ల నిర్వాహకులు చూపిస్తున్న అగ్రిమెంట్లు నిజమైనవా? కాదా? అని తేలాలన్నా.. ఎన్‌బీఎ్‌ఫసీల యాజమాన్యాలను విచారించాల్సిందేనని చెబుతున్నారు.

Updated Date - 2021-01-09T07:32:50+05:30 IST