Advertisement
Advertisement
Abn logo
Advertisement

అద్భుతంగా వ్యవసాయ యాంత్రీకరణ

బాపట్ల, నవంబరు 29: వ్యవసాయ యాంత్రీకరణ అద్భుతంగా ఆవిష్కరించబడుతుందని బెనారస్‌లోని అంతర్జాతీయ వరిపరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రదీప్‌ సంగ్వాల్‌ తెలిపారు.మండలంలోని చెరువుజమ్ములపాలెంలో ప్రాణాధార ఫౌండేషన్‌ సహకారంతో చేపట్టిన వ్యవసాయ యాంత్రీకరణపై సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణలో పంజాబ్‌ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. శాస్త్రవేత్త డాక్టర్‌ మాల్యకుమార్‌ భూమిక్‌ మాట్లాడుతూ వరిలో ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించడానికి యాంత్రీకరణ తోడ్పడుతుందని తెలిపారు. జాతీయ వరిపరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ మహేంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయం రైతులకు పెనుసవాల్‌గా మారిందన్నారు. జాతీయ వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైన ఽథాన్‌ 60, 44 రకాలు గురించి డాక్టర్‌ గిరీష్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వై.శ్రీధర్‌, బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జోసఫ్‌రెడ్డి, పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సీవీ రామారావు, జిల్లా రీసోర్స్‌సెంటర్‌ శాస్త్రవేత్త శివకుమారి, రత్నకుమారి, వ్యవసాయశాఖ అధికారులు లక్ష్మి, శారద, ప్రాణాధార డైరెక్టర్‌ కుర్రా పుండరీకాక్షుడు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.  


Advertisement
Advertisement