Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యవసాయంలో యువతరం రాణించాలి

డ్రోన్‌ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తున్న ఎన్‌.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదరనాయుడు

ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వీసీ డాక్టర్‌ ఆదాల

లాంఫాం(తాడికొండ), డిసెంబరు 3: వ్యవసాయంలో యువతరం రాణించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం ముఖ్యపాత్ర వహిస్తుందన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలలో రాణించి దేశానికి వెన్నుముఖ అయిన వ్యవసాయానికి ఊతమివ్వాలని కోరారు. ప్రతి విద్యార్థి తొలి దశలోనే వ్యవసాయం మీద అవగాహన పెంచుకోవాలని సూచించారు.  పరిశోధన స్థానంలోని అపరాలు, పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలలో జరుగుతున్న వివిధ పరిశోధనలను క్షేత్ర సందర్శనలో విద్యార్థులకు వివరించారు. డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ, యంత్ర పరికరాల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ గిరిధర్‌కృష్ణ, లాంఫాం ప్రాంతీయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ రత్నప్రసాద్‌, డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ ఏ.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ ఎల్లారెడ్డి, డాక్టర్‌ గుత్తా రామారావు, విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్‌ జే.లక్ష్మి, యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఏ.రవికుమార్‌, శాస్త్రవేత్తలు, అధికారులు, పాల్గొన్నారు. 


Advertisement
Advertisement