ఇతర పంటలపై దృష్టిసారించండి

ABN , First Publish Date - 2021-11-28T06:40:51+05:30 IST

ఇతర పంటలపై దృష్టిసారించండి

ఇతర పంటలపై దృష్టిసారించండి
గోపవరంలో రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌

వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హనుమంతు జడ్‌ కొడింబా

కూసుమంచి/ కొణిజర్ల,  నవంబరు 27: యాసంగిలో వరిసాగు వద్దని ప్రత్నామ్నాయ పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హనుమంతు జడ్‌ కొడింబ విజ్ఞప్తిచేశారు. శనివారం ఖమ్మంజిల్లా కూసుమంచిమండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతువేదిక,  కొణిజర్ల మండలం గోపవరం లోని మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులు ప్రత్నామ్నాయ పంటలు సాగుచేసుకునేలా వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న టీ-సాట్‌ ద్వారా ప్రసారాలను రైతులకు చేరేవిధంగా చూడాలని ఏడీఏ, ఏవో, ఏఈవోలకు సూచించారు. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో రైతువేదికల్లో రైతులకు శిక్షణ ఖచ్చితంగా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా యాసంగిలో క్షేత్రస్ధాయిలో తిరుగుతు పంటల నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం రిజిస్టర్లను, ఫొటో డాక్యుమెంటేషన్‌ను తనిఖీచేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన రైతువేదికకు కొనుగోలు చేసిన కుర్చీలు, టేబుల్స్‌, మైక్‌సెట్‌, ఇతర ఫర్నీచర్‌ బిల్లులు తనిఖీ చేశారు. అనంతరం సమీపంలో ఉన్న వేరుశనగ చేనుకుకు వెళ్లి పంట నమోదు ప్రక్రియను పరిశీలన చేశారు. కొణిజర్ల రైతువేదిక పరిధిలో ఎక్కువ మంది రైతులు ఉండటం వలన ఒక్కరే ఏఈవో ఉండటంతో కొంత ఇబ్బంది ఉందని, రెండు క్లస్టరులు చేయాలని, అధికారులను పెంచాలని రైతులు కోరారు. పంటలు, సర్వేనెంబర్‌లు, భూముల వివరాలు  ఆన్‌లైన్‌లో నమోదు అయ్యాయా అని కమిషనర్‌ ప్రశ్నించారు. ఎరువుల స్టాక్‌, రైతులు మధ్య తేడా కనిపించొద్దని రెండు, మూడు రోజుల్లోనే సరి చేయాలని సూచించారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, ఏడీఏలు బాబురావు, విజయచంద్ర, శ్రీనివాసరెడ్డి, సరిత, ఏవో వాణి, బాలాజీ, కూసుమంచి సర్పంచ్‌ చెన్న మోహన్‌ ఏఈవో జానీ తదితరులు పాల్గొన్నారు



Updated Date - 2021-11-28T06:40:51+05:30 IST