రైతులందరూ లబ్ధి పొందాలి

ABN , First Publish Date - 2020-08-02T10:59:31+05:30 IST

రైతులు పండించే అన్ని రకాల పంటలను ఈ క్రాప్‌లో నమోదు చేసుకునేలా కృషి చేయాలని, ఇన్సూరెన్స్‌ వస్తుందనే విషయంపై అవగాహన కల్పించాలని మంత్రి కురసాల కన్నబాబు ..

రైతులందరూ లబ్ధి పొందాలి

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 


సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 1: రైతులు పండించే అన్ని రకాల పంటలను ఈ క్రాప్‌లో నమోదు చేసుకునేలా కృషి చేయాలని, ఇన్సూరెన్స్‌ వస్తుందనే విషయంపై అవగాహన కల్పించాలని మంత్రి కురసాల కన్నబాబు  రైతులు పండించే అన్ని రకాల పంటలను ఈ క్రాప్‌లో నమోదు చేసుకునేలా కృషి  చేయాలని, ఇన్సూరెన్స్‌ వస్తుందనే విషయంపై అవగాహన కల్పించాలని మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. వైద్యనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగుదారులతో స్వయం సహాయ సంఘాలను ఏర్పాటు చేసి, నాబార్డు సహకారంతో బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. 1,20,957 హెక్టార్ల విస్తీర్ణంలో నాట్లు పడ్డాయని, 68,578 మందికి పంట సాగుహక్కు పత్రాలను అందించామన్నారు. కౌలు రైతులకు పంట రుణాలను ఆగస్టులో మంజూరు చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. 865 కియాస్క్‌ల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుల మందులను బుక్‌ చేసుకుని పొందవచ్చన్నారు. వ్యవసాయశాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్‌, డీడీలు రామారావు, ఎస్‌.మాధవరావు, ఏడీఏ జీవీ పద్మశ్రీ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-02T10:59:31+05:30 IST