పురుగు మందు అధికంగా వాడొద్దు

ABN , First Publish Date - 2021-02-25T04:50:03+05:30 IST

వరిపై పురుగు మందులు అధికంగా వాడొద్దని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని ఏవో జయవాసుకి రైతులకు సూచించారు.

పురుగు మందు అధికంగా వాడొద్దు
పెదఅమిరంలో పొలంబడిలో రైతులకు సూచనలిస్తున్న ఏవో

కాళ్ళ, ఫిబ్రవరి 24 : వరిపై పురుగు మందులు అధికంగా వాడొద్దని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని ఏవో జయవాసుకి రైతులకు సూచించారు. పెదఅమిరంలో బుధవారం పొలం బడి కార్యక్రమం సర్పంచ్‌ డొక్కు సోమేశ్వరరావుతో కలిసి నిర్వహించారు. అధికంగా పురుగు మందులు వాడడం మంచిది కాదని, అధికారులు సూచించిన మేరకు వాడా లన్నారు. పొలంలో ఆకులు, పిలకలు తొలగింపు ప్రయోగం చేసి చూపించారు. ఉప సర్పంచ్‌ జవ్వాది కిశోర్‌, ఏఈవో మురళీకృష్ణ, ఆరేపల్లి పరమేశ్వరరావు, బూరాడ వెంకటకృష్ణ, కేతా శ్రీను, శివబాలాజీ, రైతులు పాల్గొన్నారు.


భూసారాన్ని బట్టి ఎరువులు వినియోగించాలి

భీమవరం రూరల్‌ : వరి సాగులో భూసారాన్ని బట్టి ఎరువులు వినియోగించాలని వ్యవసాయశాఖ డీడీ జగ్గారావు సూచించారు. కొమరాడ రైతు భరోసా కేంద్రంలో వరిసాగు యాజమాన్యంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెగుళ్లు ఆశించినప్పుడే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పురుగు మందులు అధికంగా పిచికారీ చేయడం సరికాదని, దానివలన మిత్ర పురుగులు నశిస్తాయని తెలిపారు. జింక్‌, అగ్గితెగులు వ్యాప్తి, నివారణపై సూచనలు ఇచ్చారు.  కార్యక్రమంలో ఆత్మ పీడీ, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:50:03+05:30 IST