రంగు మారిన ధాన్యంతో రంది

ABN , First Publish Date - 2020-12-05T04:50:34+05:30 IST

దాన్యం అమ్మకాల్లో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రంగు మారిన ధాన్యంతో రంది
అంకూర్‌ వద్ద ధాన్యం ఆరబెడుతున్న రైతు

- సన్నాలకు సోకిన దోమపోటు, కాటుక తెగులు

- పంట చేతికొచ్చే దశలో కురిసిన భారీ వర్షాలు

- రంగు మారిన ధాన్యంతో ఇబ్బందులు

- కొనేందుకు నిరాకరిస్తున్న ప్రభుత్వ కేంద్రాలు

- తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముతున్న  రైతులు

- క్వింటాల్‌కు రూ.1,400 నుంచిరూ.1,500 చెల్లిస్తున్న మిల్లర్లు

- భారీగా నష్టపోతున్న అన్నదాతలు


అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. నియంత్రిత సాగు విధానంతో సన్నాల సాగు చేపట్టినా, వాతావరణం సహకరించక తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది.. వచ్చిన దిగుబడులనైనా అమ్ముకుందామంటే గింజ రంగు మారడం, తాలు శాతం పెరగడం సమస్యగా మారింది.. దీంతో నాణ్యత లేదంటూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనేందుకు నిరాకరిస్తుంటే, వ్యాపారులు ధర తగ్గించి నిలువునా రైతులను దోచుకుంటున్న పరిస్థితి దాపురించింది.. ఈ సీజన్‌లో ఉత్పత్తి అయిన ధాన్యంలో దాదాపు 30 శాతం మేర ధాన్యాన్ని రైతులు క్వింటాల్‌కు రూ.1,500 లోపే అమ్ముకుంటున్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొన్నది.. ఈ ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతాంగం భారీగా నష్టపోతోంది..


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : దాన్యం అమ్మకాల్లో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 13,60,834 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశా రు. ప్రభుత్వం నియంత్రిత సాగు అమలు చేయడంతో పాటు, వరి సాగు చేసే రైతులంతా సన్న రకాలే సాగు చేశారు. ఆ మేరకు సాగులో 90 శా తం పైచిలుకు సన్నరకాలే వేశారు. దీంతో వస్తున్న ఉత్పత్తిలోనూ 90 శా తం సన్న ధాన్యమే ఉంది. కాలం కలిసొచ్చి, ప్రకృతి సహకరిస్తే సన్నాలకు మార్కెట్‌లో మద్దతు ధర కంటే ఎక్కువే ధర లభించేది. 

అయితే, ఈ ఏడాది పరిస్థితి తిరగబడింది. వరుస వానలు, వాతా వరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల సన్నాలకు దోమపోటు, కాటుక తెగులు సోకాయి. వాటికి తోడు పంట చేతికందే సమయంలోనూ భారీ వ ర్షాలతో పైర్లు నేలవాలాయి. ఈ పరిణామాలతో దిగుబడులు తగ్గడమే కా కుండా, వచ్చిన ధాన్యంలోనూ గింజ నల్లగా మారి రంగు మారడం, తాలు శాతం పెరగడం వంటి సమస్య లు తలెత్తాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో వచ్చిన ధాన్యం ఉత్పత్తిలో 30 శాతం మేర (4 లక్షల మెట్రిక్‌ టన్నులు) ధాన్యం ఈ రకమైన మార్పునకు లోనైంది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో ఈ ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వ కొనుగోలు కేందాల్రు నిరాకరించడంతో రైతులకు దీన్ని అమ్ముకోవడం సవాల్‌గా మారింది.

సన్న రకాలు కావడంతో ఈ ధాన్యమంతా బాయిల్డ్‌ రైస్‌కు కాకుండా పచ్చి బియ్యానికే మార్చాల్సి ఉండటంతో మిల్లర్లకు అయిన కాడికి అమ్ము కోవాల్సిన అనివార్య పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రైతుల ఇబ్బం దిని ఆసరాగా చేసుకొన్న మిల్లర్లు, వ్యాపారులు ఈ ధాన్యాన్ని మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,888 కంటే తక్కువగా క్వింటాల్‌కు రూ.1,400, రూ.1,500కు లోబడే కొంటున్నారు. ఇప్పటికే దిగుబడులు తగ్గి, పంట నష్ట పోయినా ఎలాంటి భరోసా లేక అల్లాడుతున్న రైతులకు, ఈ ధర త గ్గింపు మరింత భారంగా మారింది. పంట నష్ట పరిహారం ఇవ్వని ప్రభు త్వం, కనీసం రంగు మారిన ధాన్యానికి మద్దతు ధరైనా ఇప్పించాలని, ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యం కొనేందుకు అనుమతించాలని రైతు లు డిమాండ్‌ చేస్తున్నారు. రంగు మారిన ధాన్యంలో ఇప్పటికే సగం మేర పంటను అమ్మేసుకున్నారని, మరో పది రోజుల్లో ధాన్యమంతా వ్యాపారుల కు చేరుతుందని, అప్పుడు బోనస్‌లు, మద్దతు ధరలు ప్రకటించినా రైతు లకు ఒరిగేదిమీ ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే రంగు మా రిన ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నాయకు లు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-12-05T04:50:34+05:30 IST