షిర్డీలో భక్తులకు ఉదయం, రాత్రి హారతి నిలిపివేత

ABN , First Publish Date - 2021-12-26T22:30:06+05:30 IST

మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ ప్రభావం షిర్డీ సాయిబాబా ఆలయంపై పడింది. రాష్ట్రంలో ఒమైక్రాన్...

షిర్డీలో భక్తులకు ఉదయం, రాత్రి హారతి నిలిపివేత

ముంబై: మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ ప్రభావం షిర్డీ సాయిబాబా ఆలయంపై పడింది. రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూను 'మహా' సర్కార్ విధించింది. దీంతో షిర్డీ సాయిబాబా ఆలయం రాత్రి వేళలో మూసివేస్తున్నట్టు, భక్తులకు రాత్రివేళ దర్శనం ఉండదని షిర్డీసాయి సంస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది. కర్ఫ్యూ వేళలను దృష్టిలో ఉంచుకుని భక్తులను ఉదయం, రాత్రి హారతుల దర్శనానికి అనుమతించమని పేర్కొంది.

Updated Date - 2021-12-26T22:30:06+05:30 IST