Abn logo
Oct 17 2021 @ 20:14PM

త్వరలో రాహుల్‌గాంధీకి ఏఐసీసీ బాధ్యతలు: ఉత్తమ్‌

నల్గొండ: రాహుల్‌గాంధీ త్వరలో ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండాలని, నిజాయితీతో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని త్వరలో రాహుల్‌గాంధీ చేపట్టనున్నారని, దీంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. దళితులకు 17శాతం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశాడన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఒక్కరు సైతం రిజర్వేషన్లపై మాట్లాడలేదన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్‌ దళితబంధు తెచ్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

ఇవి కూడా చదవండిImage Caption