కాంగ్రెస్‌తోనే ప్రజా సంక్షేమం

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు.

కాంగ్రెస్‌తోనే ప్రజా సంక్షేమం
సేవాదళ్‌ జిల్లా కార్యదర్శి సులోచనను సన్మానిస్తున్న సంపత్‌కుమార్‌

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

- అయిజ, ఉండవల్లిలలో పర్యటన

అయిజ/ఉండవల్లి జనవరి 21 : కాంగ్రెస్‌ పార్టీ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. అయిజ, ఉండ వల్లి మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అయిజ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది సభ్యులను చేర్పించిన సేవాదళ్‌ జిల్లా కార్యదర్శి సులోచనను సంపత్‌కుమార్‌ సన్మానించారు. బూత్‌ సభ్యులను కూడా సత్కరించారు. అధికార పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి షెక్షావలిఆచారి, కౌన్సిలర్‌ గిత్తల దేవరాజు, మండల అధ్యక్షుడు ఉత్తనూర్‌ జయన్న, నాయకులు సాంబశివుడు, ఫిరోజ్‌, దేవేందర్‌, మైనర్‌బాబు, బస్వరాజు, హనుమన్న, రవీందర్‌బాబు, శాలిపైల్‌మాన్‌, రవి, శివ, వెంకటేష్‌ పాల్గొన్నారు.


పార్టీకి పూర్వవైభవం

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టుందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించేందుకు ప్రతీ కార్యకర్త గట్టిగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. మండలంలోని 31 పోలింగ్‌బూత్‌ల పరిధిలో మూడు వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. పార్టీ పటిష్టానికి కార్యకర్తలే కీలకమన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా ములికి రామిరెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మానవపాడు ఎంపీపీ అశోక్‌కుమార్‌రెడ్డి, కలుగొట్ల పీఏసీఎస్‌ అధ్యక్షుడు పుల్లూరు గజేందర్‌ రెడ్డి, కంచుపాడు సర్పంచు శేషన్‌ గౌడు, చిన్న ఆముదాలపాడు సర్పంచు నాగేష్‌, శేరుపల్లి సర్పంచు నరేందర్‌ నాయుడు, సీనియర్‌ నాయకుడు బొంకూరు గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST