అది మీ ఇష్టం.. ఎలాంటి బలవంతం లేదు..!: సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-10-26T13:53:50+05:30 IST

ఎలాంటి బలవంతం లేదు..

అది మీ ఇష్టం.. ఎలాంటి బలవంతం లేదు..!: సీఎం జగన్‌

‘ఎయిడెడ్‌’ అప్పగింతలో బలవంతం లేదు

మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి

అలా చేయని వాటినే అప్పగించాలని కోరాం

ప్రతి నియోజకవర్గంలోనూ డిగ్రీ కళాశాల 

ఉన్నత విద్యపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌

ప్రతి నియోజకవర్గంలోనూ డిగ్రీ కళాశాల 

మూడేళ్లలో వర్సిటీల బాగు, పోస్టుల భర్తీ: సీఎం జగన్‌ 


అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను మూడేళ్లలో బాగు చేసి.. అన్ని ప్రమాణాలతోనూ మెరుగుపరిచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్‌  ఆదేశించారు. ప్రతివారం ఒక్కో విశ్వవిద్యాలయ ఉప కులపతి(వీసీ)తో ఉన్నత విద్యామండలి సమావేశం కావాలని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది భర్తీకి ఆమోదం తెలిపారు. ఉన్నత విద్యపై సీఎం సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాల మెరుగుదలకు మూడేళ్ల కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.


ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందమని తెలిపారు. చాలా విద్యాసంస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఇలాంటివారికి ప్రభుత్వపరంగా ఒక అవకాశం కల్పించామన్నారు. ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయా సంస్థలను తామే నిర్వహిస్తామని తెలిపారు. వర్సిటీలను మెరుగైన రీతిలో నడుపుతామని, దాతల పేర్లు కూడా కొనసాగిస్తామని చెప్పారు. లేదు తామే నడుపుకొంటామంటే మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి భేషుగ్గా నడుపుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వానికి ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ వర్క్‌బుక్‌, పాఠ్యపుస్తకంతో పాటు ఉన్నత విద్యామండలి పాడ్‌కా్‌స్టను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధిపొందుతున్న విద్యార్థుల్లో కావాలన్న వారికి నగదు బదులు ల్యాప్‌ట్యా్‌పలు ఇస్తున్నామని, 1.10 లక్షల మంది ల్యాప్‌ట్యా్‌పలకు ఆప్షన్‌ ఇచ్చారన్నారు.


సూచనలివ్వండి

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు మరింత పకడ్బందీగా నడిచేందుకు విశ్వవిద్యాలయాలు అవసరమైన సూచనలను ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయా కళాశాలలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగుతుందని తెలిపారు. ఒక్కో విశ్వవిద్యాలయంలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో అనుసంధానం కావాలని సూచించారు. 2025 నాటికి జీఈఆర్‌ నిష్పత్తిని 70% చేయాలన్నారు. ప్రతి విశ్వవిద్యాలయం జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకోవాలన్నారు. కొత్తగా 16వైద్య కళాశాలలు తీసుకొస్తున్నామని, ఆ కళాశాలలు స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీ్‌షచంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె. హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T13:53:50+05:30 IST