Advertisement
Advertisement
Abn logo
Advertisement

అవగాహనతోనే ఎయిడ్స్‌ను తరిమి కొట్టగలం

అవగాహనతోనే ఎయిడ్స్‌ను తరిమి కొట్టగలం

డాక్టర్‌ సమరం

వన్‌టౌన్‌, నవంబరు 30:  ఎయిడ్స్‌ను అవగాహనతోనే తరిమి కొట్టగలమని డాక్టర్‌ సమరం అన్నారు. కేబీఎన్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌రిబ్బన్‌ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యువకులకు ఎయిడ్స్‌పై పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. హెచ్‌ఐవీ సోకిన వెంటనే దాని ఉనికి రక్త పరీక్షలలో కనిపించదని తెలిపారు. మూడు దశలలో ఎయిడ్స్‌ విస్తరిస్తుందన్నారు. లైంగిక చర్యలతోనే ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ఎయిడ్స్‌ వ్యాధిని తగ్గించడానికి అనేక మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యాధి వచ్చినా సుదీర్గ కాలం జీవించిన వారు కూడా ఉన్నారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. నారాయణరావు మాట్లాడుతూ పూర్తిస్థాయి అవగాహన ఉంటే ఇటువంటి వ్యాఽధులకు దూరంగా ఉండవచ్చునని తెలిపారు. జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె. ప్రకాష్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు వి. శేషగిరిరావు, జె. పాండురంగారావు, డి. పవన్‌కుమార్‌, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ కన్వీనర్‌ ఎంవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement