Abn logo
Apr 2 2020 @ 18:39PM

కరోనా ఎఫెక్ట్‌: 200 మంది పైలట్లకు షాక్

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్‌తో ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. రిటైర్‌మెంట్ అయిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరిన సుమారు 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి ప్రకటించారు. క్యాబిన్ సిబ్బంది తప్ప అన్ని రకాల ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్‌తో దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. సంస్థ నష్టాల్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement