కువైట్ నుంచి ఎయిరిండియా, ఇండిగో 12 విమాన స‌ర్వీసులు

ABN , First Publish Date - 2020-08-13T15:25:34+05:30 IST

భార‌తీయ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా, ఇండిగోలు 17వ తేదీ వ‌ర‌కు(సోమ‌వారం) కువైట్ నుంచి భార‌తదేశంలోని వివిధ న‌గ‌రాల‌కు 12 విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.

కువైట్ నుంచి ఎయిరిండియా, ఇండిగో 12 విమాన స‌ర్వీసులు

కువైట్ సిటీ: భార‌తీయ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా, ఇండిగోలు 17వ తేదీ వ‌ర‌కు(సోమ‌వారం) కువైట్ నుంచి భార‌తదేశంలోని వివిధ న‌గ‌రాల‌కు 12 విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. వీటిలో ఇండిగో 5, ఎయిరిండియా 7 విమానాలు న‌డ‌ప‌నున్నాయి. వీటికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కువైట్‌లోని ఆయా ఎయిర్ లైన్స్ ఆఫీసుల్లో చేసుకోవ‌చ్చు. 

ఈ విమాన స‌ర్వీసుల‌ షెడ్యూల్ వివ‌రాలు ఇలా ఉన్నాయి...

13 ఆగస్టు 10:55 - కొచ్చి - ఇండిగో 

14 ఆగస్టు 12:25 - చెన్నై - ఇండిగో 

14 ఆగస్టు 14:15 - న్యూ ఢిల్లీ - ఎయిర్ ఇండియా 

14 ఆగస్టు 16:25 - విజయవాడ - ఎయిర్ ఇండియా 

15 ఆగస్టు 06:55 - భువనేశ్వర్ - ఇండిగో 

15 ఆగస్టు 14:15 - ముంబై - ఎయిర్ ఇండియా 

15 ఆగస్టు 16:25 - హైదరాబాద్ - ఎయిర్ ఇండియా

16 ఆగస్టు 06:10 - జైపూర్ - ఇండిగో‌

16 ఆగస్టు 16:25 - చెన్నై - ఎయిర్ ఇండియా 

16 ఆగస్టు 16:25 - బెంగళూరు - ఎయిర్ ఇండియా 

17 ఆగస్టు 16:25 - న్యూ ఢిల్లీ - ఎయిర్ ఇండియా 

17 ఆగస్టు 16:30 - హైద‌రాబాద్ - ఇండిగో 

వీటితో పాటు కువైట్ ఎయిర్‌వేస్, జజీరా ‌ఎయిర్‌లైన్స్ కూడా భార‌త్‌కు విమానాలు న‌డ‌ప‌నున్నాయి. 

Updated Date - 2020-08-13T15:25:34+05:30 IST