కాబూల్ నుంచి ఢీల్లీకి చేరిన ఎయిర్ ఇండియా విమానం!

ABN , First Publish Date - 2021-08-16T01:52:35+05:30 IST

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి భారత్‌కు బయలుదేరిని చివరి విమానం తాజాగా న్యూఢిల్లీలో సురక్షితంగా దిగింది.

కాబూల్ నుంచి ఢీల్లీకి చేరిన ఎయిర్ ఇండియా విమానం!

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి భారత్‌కు బయలుదేరిని విమానం తాజాగా న్యూఢిల్లీలో సురక్షితంగా దిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-243 విమానం..మొత్తం 129 మంది ప్రయాణికులతో భారత్‌కు చేరుకుంది. ఇక అఫ్గానిస్థాన్ తాలిబన్ల‌ వశమైన నేపథ్యంలో ఎయిర్ ఇండియా భవిష్యత్తులో ఆ దేశానికి విమాన సర్వీసులు నిర్వహిస్తుందా లేదా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎయిర్ ఇండియా అఫ్ఘానిస్థాన్‌కు వారానికి మూడు ట్రిప్పలు నడిపేది. కాగా.. భారత్‌కు బయలుదేరిన ఈ విమానం కాబూల్‌లో దిగేసమయంలో సమస్యలు ఎదురైన విషయం తెలిసిందే. విమానం ల్యాండింగ్‌లో మార్గదర్శకత్వం చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కొంత సమయం అందుబాటులో లేక ఉద్రిక్తత తలెత్తింది. తాజాగా ఈ విమానం సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-08-16T01:52:35+05:30 IST