Abn logo
Sep 9 2021 @ 07:45AM

Air India:అమృత్‌సర్-రోమ్‌ల మధ్య విమాన సర్వీసులు

న్యూఢిల్లీ:పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరం నుంచి నేరుగా రోమ్‌ దేశానికి మధ్య విమాన సర్వీసులను పునర్ ప్రారంభించారు.ఈ సర్వీసుల పునర్ ప్రారంభంతో అమృత్‌సర్‌లో ప్రయాణికులకు ఉపశమనం లభించింది.ఈ విమాన సర్వీసు ప్రారంభం వల్ల ఇటలీలో నివశిస్తున్న తన తండ్రిని చూసేందుకు వీలైందని సుఖ్మాన్ కౌర్ అనే ప్రయాణికురాలు చెప్పారు.కరోనా వల్ల గత ఏప్రిల్ నెల నుంచి భారతదేశంలో చిక్కుకుపోయిన వారికి ఈ విమాన సర్వీసు పునర్ ప్రారంభంతో ప్రయాణికులు ఇటలీ బాట పట్టారు. అమృత్‌సర్- రోమ్ మధ్య నేరుగా విమాన సర్వీసు తిరిగి ప్రారంభమైన తరువాత, అమృత్‌సర్ లోని శ్రీ గురురామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు లండన్, బర్మింగ్‌హామ్‌తో సహా వందే భారత్ మిషన్ కింద మూడు యూరోపియన్ నగరాలతో అనుసంధానించారు.

విమానం అమృత్‌సర్ నుంచి రోమ్‌కు బయలుదేరుతుందని, శుక్రవారం రోమ్ నుంచి తిరిగి వస్తుందని అమృత్‌సర్ విమానాశ్రయ డైరెక్టర్ విపిన్ కాంత్ సేథ్ చెప్పారు.‘‘షెడ్యూల్ ప్రకారం, విమానం బుధవారం మధ్యాహ్నం 3.55 గంటలకు అమృత్‌సర్ నుంచి బయలుదేరి అదే రోజు రోమ్‌కు చేరుకుంటుంది.ఈ విమానం శుక్రవారం ఉదయం 5.35 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది. మొత్తం 230 మంది ప్రయాణికులు మొదటి విమానంలో ప్రయాణించారు.’’అని సేథ్ తెలిపారు.