ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న వారికో గుడ్ న్యూస్.. నవంబర్ 15 నుంచి..

ABN , First Publish Date - 2021-11-05T02:13:56+05:30 IST

ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న భారతీయుల కోసం ఎయిర్ ఇండియా తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 15 నుంచీ సిడ్నీ, న్యూఢిల్లీ మధ్య నాన్‌స్టాప్‌గా విమాన సర్వీసును అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది.

ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న వారికో గుడ్ న్యూస్.. నవంబర్ 15 నుంచి..

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న భారతీయుల కోసం ఎయిర్ ఇండియా తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 15 నుంచి సిడ్నీ, న్యూఢిల్లీ మధ్య నాన్‌స్టాప్‌గా విమాన సర్వీసును అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. వందే భారత్ మిషన్ కింద వారానికి మూడు సార్లు ఈ సర్వీసు నడుస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా తాజాగా విడుదల చేసింది. కాగా.. కేంద్రం గురువారం నాడు ఎయిర్ ఇండియా ప్రతిపాదించిన వింటర్ షెడ్యూల్-2021కు ఆమోదముద్ర వేసింది. ఈ ప్రణాళిక ప్రకారం.. ఎయిర్ ఇండియా కరోనాకు పూర్వపు స్థితితో పోలిస్తే 4.38 శాతం తక్కువగా విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఈ షెడ్యూల్ 2021, అక్టోబర్ 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకూ అమల్లో ఉంటుంది. కాగా.. కరోనా దృష్ట్యా భారత్ ప్రభుత్వం విమాన సర్వీసులను 2020 మార్చి 25న నిలిపివేసిన విషయం తెలిసిందే. మే 25 నుంచి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ విమానం పూర్తి సామర్థ్యంలో కేవలం 33 శాతం మందినే అనుమతించాలంటూ అప్పట్లో నిబంధన విధించింది. అనంతరం.. కరోనా పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కేంద్రం ఈ నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు తెస్తోంది. 

Updated Date - 2021-11-05T02:13:56+05:30 IST