Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాలి కాలుష్యంతో కంటిచూపునకు గండం!

లండన్‌, జనవరి 26 : వాయు కాలుష్యం ప్రభావంతో కంటిచూపు దెబ్బతినే ముప్పు పొంచి ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2006 సంవత్సరం నుంచి కొన్నేళ్ల పాటు 1.15 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో ఈవిషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. వీరందరిని తొలుత సర్వే చేయగా.. తమకు కంటి సమస్యలు లేవని చెప్పారు. కొన్నేళ్ల తర్వాత వారికి నేత్ర వైద్యపరీక్షలు నిర్వహించగా 1,286 మందికి ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులర్‌ డీజనరేషన్‌ కారణంగా కంటిచూపు మందగిస్తున్నట్లు వెల్లడైంది. వారిలో అత్యధికులు వాయు కాలుష్య ప్రభావిత ప్రాంతాల వారేనని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement