ల్యాండింగ్ సమయంలో బరస్ట్ అయిన విమానం టైర్.. తర్వాత ఏం జరిగిందంటే?

ABN , First Publish Date - 2021-06-16T12:17:36+05:30 IST

ప్రస్తుత మోడ్రన్ యుగంలో దూరప్రాంతాలకు వెళ్లాలంటే ఎక్కువ మంది ఎంచుకునే రవాణా విధానం విమానాలే. విమానాలు వచ్చిన తర్వాత దేశాల మధ్య దూరం తగ్గింది.

ల్యాండింగ్ సమయంలో బరస్ట్ అయిన విమానం టైర్.. తర్వాత ఏం జరిగిందంటే?

హుబ్లి: ప్రస్తుత మోడ్రన్ యుగంలో దూరప్రాంతాలకు వెళ్లాలంటే ఎక్కువ మంది ఎంచుకునే రవాణా విధానం విమానాలే. విమానాలు వచ్చిన తర్వాత దేశాల మధ్య దూరం తగ్గింది. ఒకప్పుడు పడవల్లో పదులకొద్దీ రోజులు ప్రయాణిస్తేకానీ చేరుకోలేని గమ్యాలను, విమానాల్లో గంటల్లోనే చేరుకోగలుగుతున్నాం. అయితే విమాన ప్రయాణాల్లో అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు సంభవించడం తరచూ జరుగుతోంది. తాజాగా కర్ణాటకలోని హుబ్లిలో ఒక విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. విమానం టైర్ బరస్ట్ అయిపోయింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో వారందరూ సేఫ్‌గా ల్యాండయ్యారు. రన్ వే కొద్దిగా దెబ్బతిన్నట్లు సమాచారం.




గాలే కారణమా?

కర్ణాటకలోని కన్నూర్ నుంచి హుబ్లి వచ్చిందా ఇండిగో కంపెనీ విమానం. రాత్రి 8.30 గంటలకు ల్యాండవ్వాల్సింది. కానీ వ్యతిరేక దిశలో భయంకరంగా గాలులు వీస్తుండటంతో విమానం ల్యాండవ్వలేదు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత 8.35కు విమానం ల్యాండ్ చేయాలని పైలట్ భావించాడు. అలా చేస్తున్నప్పుడే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఎదురు గాలిలో ల్యాండయ్యే సమయంలో తలెత్తిన సమస్యల వల్లే విమానం టైర్ బరస్ట్ అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. విమానం మెయింటెనెన్స్ జరుగుతోందని, విమాన సిబ్బంది, ప్యాసింజర్స్ అందరూ క్షేమంగానే ఉన్నారని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే మెయింటెనెన్స్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆ విమానం ప్రయాణానికి రెడీ అయిపోయిందని తెలిపింది.



Updated Date - 2021-06-16T12:17:36+05:30 IST