ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎయిర్‌ వారియర్స్‌

ABN , First Publish Date - 2021-10-23T13:12:43+05:30 IST

స్థానిక తాంబరంలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద జరిగిన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ సందర్భంగా 660 మంది ఎయిర్‌వారియర్స్‌ను ఎయిర్‌ఫోర్స్‌లోకి చేర్చారు. ఈ ఎయిర్‌ వారియర్స్‌ 64 వారాల పాటు మెకాని

ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎయిర్‌ వారియర్స్‌

చెన్నై(Tamilnadu): స్థానిక తాంబరంలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద జరిగిన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ సందర్భంగా 660 మంది ఎయిర్‌వారియర్స్‌ను ఎయిర్‌ఫోర్స్‌లోకి చేర్చారు. ఈ ఎయిర్‌ వారియర్స్‌ 64 వారాల పాటు మెకానికల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పరేడ్‌ నిర్వహించారు. వారు నిర్వహించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎయిర్‌ కమోడర్‌ ఎస్‌.శివకుమార్‌ కవాతును తిలకించి, ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి ట్రోఫీలను అందజేశారు.

Updated Date - 2021-10-23T13:12:43+05:30 IST